పెరగనున్న బల్బులు, ఎల్ఈడీ లైట్ల ధరలు

by  |
పెరగనున్న బల్బులు, ఎల్ఈడీ లైట్ల ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: తయారీలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచబోతున్న నేపథ్యంలో బల్బులు సహా ఎల్ఈడీ లైటింగ్ ఉత్పత్తుల ధరలు 10-15 శాతం పెరిగే అవకాశాలున్నాయి. అయితే, దేశీయ తయారీదారులు ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు. ‘ఎల్ఈడీ లైటింగ్ ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే ఇన్‌పుట్, విడిభాగాలపై సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనివల్ల స్వల్పకాలం స్థానిక తయారీ లైటింగ్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని’ ఎలక్ట్రిక్ లాంప్ అండ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్(ఎల్కోమా) అధ్యక్షుడు సుమిత్ జోషి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో స్థానిక కాంపోనెంట్ ఎకోసిస్టమ్ లేకపోవడం వల్ల దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ భాగాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని, అందుకే ధరల పెరుగుదల తప్పదని ఆయన వివరించారు. ఎల్ఈడీ తయారీకి ఉపయోగించే డ్రైవర్, ఎంసీపీసీబీలతొ సహా విడిభాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని 5 నుంచి 10 శాతం పెరగడం వల్ల ధరల పెంపు తప్పనిసరి అయిందన్నారు.

Next Story

Most Viewed