‘ఎల్లూరి’కి దాశరథి పురస్కారం.. ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

by  |
Famous literary figure Elluri Shiva Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ సాహితీవేత్త, మాజీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎల్లూరి శివారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య సాహతీ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దాశరథి జయంతి సందర్భంగా సాహితీవేత్తలను పురస్కారంతో సత్కరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే 2021 సంవత్సరానికి ఎల్లూరి శివారెడ్డిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి అర్హులైనవారిని ఎంపిక చేయడానికి ఏర్పడిన కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించే భాష-సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ నేతృత్వంలో ఈ నెల 17వ తేదీన జరిగిన సమావేశంలో పలువురి పేర్లపై చర్చ జరిగింది. చివరకు ఎల్లూరి శివారెడ్డిని ఈ కమిటీ ఖరారు చేసింది.

రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీనివాసగౌడ్ చేతుల మీదుగా రవీంద్రభారతిలో ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఈ పురస్కారం కింద ప్రభుత్వం తరఫున లక్షా వెయ్యి నూట పదహారు రూపాయల నగదుతో పాటు మెమెంటో, శాలువ సత్కారం ఉంటుంది. ప్రతీ ఏటా దాశరధి జయంతి రోజున పురస్కార ప్రదానం జరుగుతుంది. సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రకటన చేసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పురస్కార గ్రహీత ఎల్లూరి శివారెడ్డికి అభినందనలు తెలియజేశారు. కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో గజల్ రుబాయీల వంటి ఉర్దూ, పాఱ్వీ సాహిత్య సంప్రదాయాలను ప్రవేశపెట్టారని, గంజా-జమునా తెహజీబ్‌ సంస్కృతికి వారధి కటటి అక్షర సారధి దాశరధి అనే గుర్తింపు తెచ్చుకున్నారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed