టీఆర్‌ఎస్‌లో 'ఎమ్మెల్సీ' పదవుల దుమారం

by  |
trs leader
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణకు మొండిచెయ్యి చూపించారు. ఉద్యమకారులు, సీనియర్ రాజకీయ నేతలు ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోలేదు. ఒక్కరికి మాత్రమే ప్రాధాన్యత కల్పించడంతో ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్​రెడ్డికి మాత్రమే అవకాశం కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రాధాన్యత కల్పిస్తారని ఆశలు పెట్టుకున్న మిగతా నేతలకు నిరాశే మిగిలింది. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

సోమవారం రాత్రి వరకు ఛాన్స్​ ఇస్తారని ఎదురుచూసిన కోటిరెడ్డికి నిరాశే ఎదురైంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇవ్వలేదు. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన వారికి సీఎం కేసీఆర్​ పెద్దపీట వేశారు. ఏకంగా ఐదుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. అందులో కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్​రావు, పాడి కౌశిక్​రెడ్డి, వెంకట్​రాంరెడ్డి, బండా ప్రకాశ్​కు అవకాశం కల్పించారు. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. దక్షిణ తెలంగాణకు చెందిన నేతలు కేసీఆర్​ తమపై చిన్నచూపు చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో దుమారం రేపుతోంది.

Next Story