‘గాంధీ’లో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభం

by  |
‘గాంధీ’లో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలను ప్రారంభించేందుకు ఆసుపత్రి వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా విజృంభించిన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి గాంధీ ఆసుపత్రిలో కేవలం కొవిడ్ పేషెంట్లకు మాత్రమే చికిత్సలు అందించారు. కరోనా పేషెంట్ల సంఖ్య ఎక్కవగానే ఉన్నప్పటికీ నాన్ కొవిడ్, ఎమర్జెన్సీ చికిత్సలు కూడా అందించాలని గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్ణయించారు. ఆగస్ట్ 03 నుంచి అన్ని రకాల వైద్య సేవల (నాన్ కొవిడ్)ను అందిస్తున్నట్టుగా సూపరింటెండెంట్ రాజారావు మంగళవారం సర్కులర్ జారీ చేశారు.

కొవిడ్ పేషెంట్లకు చికిత్సలు అందించేందుకు ఆసుపత్రిలోని సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ బ్లాకులను కొవిడ్-మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులకు వినియోగిస్తున్నట్టుగా తెలిపారు. మిగతా అన్ని వార్డులను నాన్ కొవిడ్ సేవలకు కేటాయిస్తామని వివరించారు. కొవిడ్ పేషెంట్ల తాకిడి కొనసాగుతుండటంతో సిబ్బందిలో 40శాతం మందిని కొవిడ్ చికిత్సలకు 60శాతం మందిని నాన్ కోవిడ్ చికిత్సలందించేందుకు ఏర్పాట్లు నియమిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన రోస్టర్లను రూపొందించాల్సిందిగా డిపార్డ్‌మెంట్ల హెచ్ఓడీలను ఆదేశాలు జారీ చేశామన్నారు. పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేపడుతామని తెలిపారు. .



Next Story