ఓయూలో రూ.6 కోట్లతో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం..

by  |
osmania
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.6కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ అండ్ యాడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సెంటర్‌ను శనివారం కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రారంభించారు. ఓయూలో కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రం దేశంలోని ఇతర ఐఐటీ లకు ధీటుగా పనిచేస్తుందని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. ఈ కేంద్రం తెలంగాణ రాష్ర్టంలోని డిగ్రీ, పీజీ, పరిశోధనా విద్యార్థులకు ఎంతగానో దోహపడుతుందన్నారు.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ కేంద్రం, రాష్ర్టంలోని మరింత మంది విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, ఎడిఫై టెక్నాలజీస్, ఇన్నోవా హాస్పిటల్స్ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, మాజీ వీసీ రామచంద్రం, ఓయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed