కోర్టుకెక్కిన Google, Twitter.. ఆ నిషేధాలే కారణం..

by Dishafeatures2 |
కోర్టుకెక్కిన Google, Twitter.. ఆ నిషేధాలే కారణం..
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్, ట్విట్టర్ సహా మరికొన్ని టెక్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని నిషేధాలను పరిగణలోనికి తీసుకొని మీడియా చట్టాన్ని బ్లాక్ చేయాలని భావించాయి. తమతమ లాబీయింగ్ ద్వారా ప్రాతినిధ్యం వహించే పలు సంస్థలు అమెరికాలోని సుప్రీంకోర్టులో అత్యవసర అభ్యర్థనను దాఖలు చేశాయి. టెక్సాస్ మీడియా చట్టాన్ని బ్లాక్ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆయా సంస్థలు తమ అభ్యర్థనలో కోరాయి. టెక్సాస్ మీడియా చట్టం.. యూజర్లను వారి రాజకీయ అభిప్రాయాల ఆధారంగా నిషేధించకుండా సంస్థలను టెక్సాస్ మీడియా చట్టం నిషేధిస్తోందని సంస్థలు పేర్కొన్నాయి.

అంతేకాకుండా టెక్సాస్ మీడియా చట్టం నిషేధాల ద్వారా నెలకు దాదాపు 50 మిలియన్ యూజర్లతో ఉండే సోషల్ మీడియా సంస్థలు కొందరు యూజర్లను నిషేధించలేవు, దాంతో పాటుగా ఆయా సంస్థలు తమ కంటెంట్‌ను ఎలా మోడరేట్ చేస్తాయి అన్న విషయాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని సంస్థల వారు గతేడాది విజయవంతంగా అడ్డుకున్నారు. మరి ఇప్పుడు టెక్ సంస్థలు దాఖలు చేసిన అభర్థనపై యూఎస్ సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Next Story

Most Viewed