ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ షురూ

by Disha Web Desk 1 |
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ షురూ
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తరువాత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు గుడివాడ అమర్నాథ్ , ఉషశ్రీ చరణ్ , దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ మోహన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Next Story

Most Viewed