'రంగమార్తాండ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరికో తెలుసా..?

by Shiva |
రంగమార్తాండ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరికో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణవంశీ కొన్నేళ్ల పాటు పరాజయాలతో సతమతమవుతున్నాడు. తిరిగి ఇప్పుడు రీఫ్రెష్ అవుతూ రంగమార్తాండ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా మార్చి 22న విడుదలవుతున్నట్లు చిత్రంబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించిన ఓ వార్త బయటకొచ్చింది. ‘రంగమార్తాండ’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకున్నారట. డీసెంట్ రేటుకు ఈ సినిమా హక్కులను పొందినట్లు సమాచారం. థియేటర్స్ లో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలో డిసైడ్ చేస్తారట.

Next Story

Most Viewed