నకిలీ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

by GSrikanth |
నకిలీ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: నకిలీ కరెన్సీ గ్యాంగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పాతబస్తీలో నకిలీ నోట్ల దందా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం రాత్రి ముఠా సభ్యులు నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్నట్టు తెలిసి దాడి చేశారు. ఓ మహిళతోపాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 30 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story