ఆ ప్రాంతాల్లో జోరుగా పందేలు.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు..

by Disha Web |
ఆ ప్రాంతాల్లో జోరుగా పందేలు.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు..
X

దిశ, బాన్సువాడ: సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చిందని ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు కొక్కొరోక్కో కోడి పందాలు కాదాం రండి అంటూ బెట్టింగ్ రాయుళ్ళు కోడి పందాల వెంటపడ్డారు. ముందుగా ఏర్పాట్లు చేసుకున్న ప్రకారం పలు గ్రామ శివార్లలో ఈ పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. పందాలకు పెంచిన కోళ్లను కత్తులు కట్టి బరిలోకి దింపుతున్నారు. కోళ్లపందాలపై రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. మరికొందరు కొండ పై పందెం కాయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లారు.

వర్ని మండలంలోని జలాల్పూర్, హమ్నపూర్, భవానీపేట్, నెహ్రూ నగర్ గ్రామ శివార్లలో కోళ్ల పందాలు యధేచ్చగా సాగడం విస్మయం రేకెత్తిస్తుంది. పోలీసులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పందేలలో డబ్బులు పోగొట్టుకున్న కుటుంబీకులు మాత్రం పోలీసుల నిర్లక్ష్యంతోనే పందేలు కొనసాగుతున్నాయని మండిపడుతున్నారు.Next Story