తెలంగాణలో తాజాగా 1676 కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 1676 కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,676 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 41,018కి చేరింది. వైరస్ బారిన పడి గురువారం 10 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 396కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 1,296 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 27,295కు చేరింది. తాజాగా నమోదు అయిన కేసుల్లో హైదరాబాద్‌లో 788, రంగారెడ్డి 224, మేడ్చల్ 160, సంగారెడ్డి 57, ఖమ్మం 10, కామారెడ్డి 5, వరంగల్ అర్బన్ 47, వరంగల్ రూరల్ 1, కరీంనగర్ 92, మహబూబాబాద్ 19, మెదక్ 26, నల్లగొండ 64, నాగర్ కర్నూలు 30, నిజామాబాద్ 20, వనపర్తి 51, సూర్యాపేట 20, గద్వాల 5, వికారాబాద్ 8, నారాయణపేట్ 7 కేసులు నమోదు అయ్యాయి.

Next Story

Most Viewed