బిలియనీర్‌ జాబితాలో మరో ఇండియన్

by Harish |
Venkatraman
X

దిశ, వెబ్‌డెస్క్ : లాటెంట్ వ్యూ అనలిటిక్స్ చైర్‌పర్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అడుగూడి విశ్వనాథన్ వెంకట్రామన్‌ బిలియనీర్‌ జాబితాలో చేరారు. లాటెంట్ వ్యూ IPOతో ఈ ఘనతను సాధించారు. చెన్నైకి చెందిన ఈసంస్థ ఈ నెల ప్రారంభంలో IPOకి వెళ్లింది. ఇష్యూ ధర రూ.197తో మెుదలై శుక్రవారం నాటికి రూ. 697 వద్ద ముగిసింది. ప్రారంభ ధరతో పోలిస్తే 256 శాతానికి పైగా పెరిగింది. వెంకట్రామన్‌ ఆ కంపెనీలో(69.62%) వాటాతో 117.91 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. మార్కెట్ వాల్యు ప్రకారం వాటా విలువ రూ. 8,275.88 కోట్లు (1.11 బిలియన్ డాలర్లు).

వెంకట్రామన్ IIT మద్రాస్ లో గ్రాడ్యుయేషన్,IIM కలకత్తా లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కాగ్నిజెంట్‌లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2007 జనవరి 3 నుంచి లాటెంట్ వ్యూ అనలిటిక్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తరువాత ఆగస్టు 2021 నుండి కంపెనీకి చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. లాటెంట్ వ్యూ అనలిటిక్స్ డేటా ఇంజనీరింగ్, ప్యూర్-ప్లే డేటా అనలిటిక్స్ వంటి సేవలు అందిస్తుంది.Next Story

Most Viewed