ఆ ఇద్దరి మరణానికి ఎదుటి వ్యక్తే కారణమా..?

by  |
Road Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట నుంచి రాజమండ్రి వెళ్తున్న స్కార్పియో ఎలమంచిలి మండలం పురుషోత్తపురం జాతీయ రహదారి జంక్షన్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యి స్పాట్ లోనే మృతిచెందారు. కాగా, మృతుల వివరాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను ఎలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed