నాకు నా కుక్క కావాలి: ఆచూకీ చెబితే మీకు రూ.3.65 కోట్లిస్తా

by  |
నాకు నా కుక్క కావాలి: ఆచూకీ చెబితే మీకు రూ.3.65 కోట్లిస్తా
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన పాప్ సింగర్ లేడీ గాగా రూ.3.65 కోట్లు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటున్న లేడీ గాగాకు చెందిన కోజి, గుస్టావో అనే రెండు పెంపుడు కుక్కల్ని గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. సంరక్షకుడు గత రాత్రి 9.40 ప్రాంతంలో కోజి, గుస్టావో తో పాటు మరో కుక్కను వాకింగ్‌కు తీసుకుని వెళుతుండగా దుండగులు నాలుగు సార్లు కాల్పులు జరిపి కుక్కల్ని అపహరించారు. . దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుణ్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కుక్కలు మాయం అవ్వడంపై లేడీగాగా విచారం వ్యక్తం చేశారు. తన శునకాల ఆచూకీ చెప్పిన వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3.65 కోట్ల రివార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా లాస్ ఏంజిల్స్ పోలీస్ కెప్టెన్ జోనాథన్ టిప్పెట్ మాట్లాడుతూ సంరక్షకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక మూడు కుక్కల్లో ఓ కుక్క సేఫ్ గానే ఉన్నాయని , మరో రెండు కుక్కలు ఆచూకీకోసం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు కెప్టెన్ జోనాథన్ వెల్లడించారు.



Next Story

Most Viewed