భవన శిథిలాలు మీద పడి కార్మికుడు మృతి..

by  |
భవన శిథిలాలు మీద పడి కార్మికుడు మృతి..
X

దిశ, చార్మినార్ : పాత నిర్మాణాలను కూలుస్తుండగా ప్రమాదవశాత్తు శిథిలాలు మీద పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్​పరిధిలో శుక్రవారం వెలుగుచూస్తుంది. వివరాల్లోకివెళితే.. పాతబస్తీ రాజన్న బావి శివాజీనగర్‌లో సెయింట్​మరియా స్కూల్​భవనాన్ని గత కొన్ని రోజుల కిందట మాలాద్రి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ భవనంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత గోడలను కూల్చడానికి ఇద్దరు కూలీలతో పనులు చేపడుతున్నారు.

ఈరోజు శేఖర్​అనే వ్యక్తి పై నుంచి గన్ మిషన్‌తో గోడలను, భీమ్‌ను కూలుస్తుండగా కింద నిలబడిన కేశవులు(35) పై ప్రమాదవ శాత్తు శిథిలాలు పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన కేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్​నగర్‌కు చెందిన కేశవులుకు భార్య నీలమ్మ, ఇద్దరు సంతానం కలరు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ఛత్రినాక పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed