పనిగంటలు పెంచేందుకు కుట్ర చేస్తున్నారు !

by  |
పనిగంటలు పెంచేందుకు కుట్ర చేస్తున్నారు !
X

దిశ, న్యూస్‌బ్యూరో: కార్మికుల హక్కులను కాపాడేందుకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా వ్యాఖ్యానించారు. ఆదివారం టీపీసీసీ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కుంతియా మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగకరంగా లేదని విమర్శించారు. కరోనాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను సవరించి పనిగంటలను పెంచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed