రేవంత్ ఆడియో వైరల్.. ట్వీట్ చేసిన కేటీఆర్

106

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ప్రశంసించిన ఐటీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయిన ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ పై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో సెగ తాకుతుంది. రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ రేటెడ్ క్రిమినల్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. రేవంత్ రెడ్డిలాంటి  నిచమైన వ్యక్తులు స్పందించరేమో కానీ, రాజకీయాల్లో ఉన్న చెత్తను అందరి ముందు ఉంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి శశిథరూర్ పై చేసిన ఆడియోను ట్వీట్ చేశారు.

ఈ ఆడియో తనకు ఒక మీడియా మిత్రుడు పంపించారన్న కేటీఆర్, ఈ ఆడియోను ఫోరెన్సిక్ కి పంపిస్తే  ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి వాయిస్ తో కచ్చితంగా మ్యాచ్ అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఏమైనా స్పందిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతపై నోరు పారేసుకోవడంపై అటు రాష్ట్రంలోని పలువురితో పాటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు చురకలు అంటిస్తున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత మనీష్ తివారి రేవంత్ రెడ్డికి గట్టిగానే ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. శశిధరూర్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడని, ఆయన నీకు నాకు అలాగే అందరికీ అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

మరోవైపు శశిధరూర్ సైతం తనదైన శైలిలో స్పందించారు. బహుశా రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొని గాడిద ఆనే మాట అన్నారేమో అని స్పందించారు. తాము ప్రచురించిన వార్తాకథనంలో ఏ మాత్రం ఆవాస్తవం లేదని తమ వద్ద ఖచ్చితమైన ఆధారం ఉందని, తమ వార్తాకథనాన్ని కి కట్టుబడి ఉన్నామని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది. ఓ వైపు వందలాది మంది శశిధరూర్ అభిమానులు, రేవంత్ రెడ్డి గత చరిత్రను కేసులను ఎత్తిచూపుతూ తీవ్రంగా ట్వీట్లు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..