తమసోమా జ్యోతిర్గమయ ట్రైలర్ విడుదల చేసిన కేటీఆర్

39
Tamasoma Jyotirgamaya Trailer

దిశ, సినిమా : విమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై తడక రమేష్ నిర్మించిన చిత్రం ‘తమసోమా జ్యోతిర్గమయ’. ‘స్టోరీ ఆఫ్ వీవర్’ క్యాప్షన్‌తో తెరకెక్కిన చిత్ర ట్రైలర్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వచ్చిన మేటి తెలుగు సినిమాల్లో ‘తమసోమా జ్యోతిర్గమయ – Story of a Weaver’ ఒక ఆణిముత్యమని అన్నారు. నేతన్నల కష్టాలు, కన్నీళ్లు, శ్రమకు దృశ్యరూపం ఇవ్వడమే కాక వారిలో ఉన్న గొప్ప కళను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. అలాగే చేనేత, చేతివృతుల్లో మరెన్నో ఇన్నోవేషన్స్ రావాలని ఆకాంక్షించిన కేటీఆర్.. ఇలాంటి చిత్రాలు సమాజానికి ఎంతో అవసరమని, తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశాంత్ బీజే మ్యూజిక్ అందించిన చిత్రానికి శ్రవణ్ జీ కుమార్ డీఓపీగా పనిచేశారు. నేడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ నెల 29న సినిమా విడుదల చేయనున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..