తెలంగాణలో లాక్‌డౌన్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

256

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్‌లో మరోసారి ‘Ask KTR’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తారా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు రాష్ట్రంలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. అలాగే ఓ నెటిజన్ అడిగిన మరో ప్రశ్నకు కేటీఆర్.. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని.. రాష్ట్రానికి సేవ చేయడమే సంతోషంగా ఉందని సమాధానం చెప్పారు.