నాలుగు కాదు నలభై పెళ్లిళ్లు చేసుకుంటా.. అడగడానికి మీరెవరు..? – నటి

by  |
నాలుగు కాదు నలభై పెళ్లిళ్లు చేసుకుంటా.. అడగడానికి మీరెవరు..? – నటి
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ నాలుగవ పెళ్లి చేసుకుందన్న వార్తలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమిళ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ తో పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో చూసినవారంతా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారనే అనుకొని ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. మొన్నేగా మూడవ పెళ్లి పెటాకులయ్యింది.. అప్పుడే నాలుగో పెళ్ళికి రెడీ అయ్యావా..? అని విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయమై వనితా సీరియస్ అయ్యింది. మీడియా ముందు మాట్లాడుతూ నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

“ఒకరితో కలిసి ఫోటో దిగినంత మాత్రానా పెళ్లి చేసుకున్నట్లేనా..? మేము సినీ ఇండస్ట్రీలో ఉన్నాం.. అది సినిమా కోసం దిగిన ఫోటో మాత్రమే.. నిజంగా జరిగిన పెళ్లి కాదు” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చింది. “పెళ్లి పెళ్లి అంటూ మీడియా లో గగ్గోలు పెడుతున్నారు. కొందరు నేను మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు విమర్శిస్తున్నారు. నా పెళ్లి గురించి వారికి ఎందుకు. వారికి సంబంధించిన విషయాలపై శ్రద్ద చూపించుకుంటే బాగుంటుంది.

ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు.. అయినా వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పు కానీ పద్దతిగా పెళ్లి చేసుకుంటే తప్పేంటి..? వివాహేతర సంబంధాలు పెట్టుకున్నవారిని ఇలాగే అడుగుతున్నారా..?. నాలుగు కాదు నలభై పెళ్లిళ్లు చేసుకుంటా.. అడగడానికి మీరెవరు అంటూ విరుచుకుపడింది. ప్రస్తుతం ఆమె ‘పికప్ డ్రాప్’ అనే చిత్రంలో శ్రీనివాసన్ సరసన నటిస్తుంది. అందులోని స్టిల్సే ఇవి అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Next Story