ఈ తాజా వార్త కొల్లు రవీంద్ర గురించే

by  |
kollu ravindra
X

దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతో తనను ఈ కేసులో ఇరికించారని కొల్లు రవీంద్ర బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తరపు న్యాయవాది.. ఈ కేసులో నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్నవారని, కేసులో సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థులని వివరిస్తూ, మరింత లోతైన విచారణకు అప్పగించాలని కోరడంతో రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story