కేకేఆర్‌లో ఆ ఒక్కడే కొట్టాడు

by  |
కేకేఆర్‌లో ఆ ఒక్కడే కొట్టాడు
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టును ఓపెనర్లు ముంచేసినా.. లోయర్ ఆర్డర్‌లో వచ్చిన కమ్మిన్స్ కుమ్మేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న జట్టుకు ప్యాట్ కమ్మిన్స్(53*) పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కమ్మిన్స్‌కు తోడుగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (39*) జట్టు స్కోరును ఆదుకున్నాడు. 61 పరుగుల వద్దనే కీలక ఆటగాళ్లు చేతులెత్తేసినా వీరిద్దరి భాగస్వామ్యంలో స్కోరు బోర్డు 148కు చేరుకుంది.

ఇన్నింగ్స్‌ సాగిందిలా..

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇయాన్ మోర్గాన్‌కు ఓపెనర్లు షాక్ ఇచ్చారు. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. కేవలం 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (7), శుబ్‌మన్ గిల్(21), నితీష్ రానా(5), దినేష్ కార్తీక్ (4), ఆండ్రూ రస్సెల్(12) పరుగులు చేసి చేతులెత్తేశారు. దీంతో 10.4 ఓవర్లు ముగిసే సరికి 61 పరుగుల వద్ద కోల్‌కతా జట్టు 5 కీలక వికెట్లను కోల్పోయింది.

ఇక అప్పటికే క్రీజులో ఉన్న ఇయాన్ మోర్గాన్‌ తడబడుతూ ఆడుతున్న సమయంలో వచ్చిన ప్యాట్ కమ్మిన్స్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక బౌలర్ ఈ స్థాయిలో ఆడటం ఆ జట్టులో ఇదే తొలిసారి. చివరి వరకు నిలబడి నాటౌట్‌గా నిలిచిన ప్యాట్ కమ్మిన్స్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఇక ఇయాన్ మోర్గాన్ బాల్ టు బాల్ ఆడుతూ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కోల్‌కతా 148 పరుగులు చేయగలిగింది.

స్కోరు బోర్డు:

Kolkata Knight Riders Innings:

1. రాహుల్ త్రిపాఠి c సూర్యకుమార్ యాదవ్ b బోల్ట్ 7(9)
2. శుబ్‌మన్ గిల్ c పొలార్డ్ b రాహుల్ చాహర్ 21(23)
3. నితీష్ రానా c డీకాక్ b కౌల్టర్-నైల్ 5(6)
4. దినేష్ కార్తీక్ (wk)b రాహుల్ చాహర్ 4(8)
5. ఇయాన్ మోర్గాన్ (c) నాటౌట్ 39(29)
6. ఆండ్రూ రస్సెల్ c డీకాక్ b బుమ్రా 12(9)
7. ప్యాట్ కమ్మిన్స్ నాటౌట్ 53(36)

ఎక్స్‌ట్రాలు: 7

మొత్తం స్కోరు: 148

వికెట్ల పతనం: 18-1 (రాహుల్ త్రిపాఠి, 2.6), 33-2 (నితీష్ రానా, 5.3), 42-3 (శుబ్‌మన్ గిల్, 7.3), 42-4 (దినేష్ కార్తీక్, 7.4), 61-5 (ఆండ్రూ రస్సెల్, 10.4)

బౌలింగ్:

ట్రెంట్ బోల్ట్ 4-0-32-1
నాథన్ కౌల్టర్-నైల్ 4-0-51-1
జస్ప్రీత్ బుమ్రా 4-0-22-1
కృనాల్ పాండ్యా 4-0-23-0
రాహుల్ చాహర్ 4-0-18-2


Next Story