ఘనంగా కోహ్లీ జన్మదిన వేడుకలు

by  |
ఘనంగా కోహ్లీ జన్మదిన వేడుకలు
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 33వ ఏడాదిలోకి ప్రవేశించాడు. ఐపీఎల్ కోసం ప్రస్తుతం యూఏఈలో ఉన్న కోహ్లీ.. అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. బుధవారం అర్థరాత్రి సమయంలో బెంగళూరు జట్టు సభ్యులతోపాటు భార్య అనుష్క కలసి కోహ్లీతో కేక్ కట్ చేయించారు. అతడి ముఖానికి కేక్ పూసి సహచరులు సందడి చేశారు. రాత్రి చాలా సేపు ఆటపాటలతో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. కాగా, కోహ్లీ జన్మదినం సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు, సహచరులు, సెలెబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఒక లెజెండ్’ అంటూ సర్ వీవియన్ రిచర్డ్స్ ట్వీట్ చేశారు. ‘టీమ్ ఇండియా అత్యుత్తమ బ్యాట్స్‌మాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండు’ అంటూ యువీ ట్వీట్ చేశాడు. ఇక మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. శుక్రవారం ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌తో తలపడనున్నది.

Next Story

Most Viewed