పాండ్యా కుటుంబంతో కలసి కోహ్లీ న్యూఇయర్ సెలెబ్రేషన్స్

by  |
పాండ్యా కుటుంబంతో కలసి కోహ్లీ న్యూఇయర్ సెలెబ్రేషన్స్
X

దిశ, స్పోర్ట్స్ : భార్య అనుష్క డెలివరీ కోసం ఇండియాకు తిరిగి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త సంవత్సర వేడుకలను ముంబైలో ఘనంగా జరుపుకున్నాడు. సహచర క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతడి భార్య నటాషా స్టాంకోవిచ్‌, మరి కొంత మంది స్నేహితులతో కలసి డిసెంబర్ 31 రాత్రి డిన్నర్ చేసి సంబరాలు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వెళ్లిన వీళ్లు కోవిడ్ పరీక్షల అనంతరమే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలిపాడు. ‘నెగెటివ్‌గా తేలిన మిత్రులందరూ కలసి ఒకేచోట సమయాన్ని గడిపాము. ఇంట్లో ఉన్న సురక్షితమైన వాతావరణంలో కలుసుకోవడానికి మించినది లేదు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని కోహ్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Next Story

Most Viewed