ఆ విషయాన్ని పీఎం దృష్టికి తీసుకెళ్తా: కిషన్ రెడ్డి

by  |
ఆ విషయాన్ని పీఎం దృష్టికి తీసుకెళ్తా: కిషన్ రెడ్డి
X

దిశ, ముషీరాబాద్: రజకుల అభివృద్ధితో పాటు వారిని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకోవడానికి బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రజక దోబీ అభివృద్ధి సంస్థ షెడ్యూల్డ్ క్యాస్ట్ పోరాట సమితి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్జాన కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా రజకులను కొన్ని రాష్ట్రాలలో షెడ్యూల్డ్ క్యాస్ట్‌లో కలిపారని, మన రాష్ట్రంలో కలపలేదన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న విషయాన్నికేంద్ర ప్రభుత్వం, బీసీ కమిషన్, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. రజక దోబీ అభివృద్ది సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తీసుకురావాలన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బీసీ కమిషన్ కు చట్టబద్దమైన అధికారం కల్పించిన ఘనత మోదీ

Next Story

Most Viewed