కిమ్ కిమ్’ చాలెంజ్

by  |
కిమ్ కిమ్’ చాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ఈ తరహా చాలెంజ్‌లు బోలెడన్ని పుట్టుకురాగా, ఇప్పుడు మరో కొత్త చాలెంజ్ తెరమీదకు వచ్చింది. ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమా చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మంజు వారియర్.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమాలో తను పాడిన ‘కిమ్ కిమ్’ అనే పాటపై డ్యాన్స్ చేసి ఓ వీడియో రూపొందించింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో పాటు అభిమానులలు, చిన్నారులు కూడా ఆ పాటకు డ్యాన్స్ చేసి వీడియో షేర్ చేయమని కోరింది.

‘మీ పిల్లలు డ్యాన్స్ చేస్తారా? అయితే ‘కిమ్ కిమ్’ బీట్‌కు అద్దిరపోయే స్టెప్పులు వేయించి, ఆ వీడియో షేర్ చేయండి. అంతేకాదు మీరు చిన్నారులు కాకపోయినా, మీలోని పసివాడ్ని బయటకు తీసుకురండి, మ్యూజిక్ ఆన్ చేసి 1,23,4 అంటూ కాలు కదపండి, చాలెంజ్ విత్ ‘కిమ్ కిమ్’లో పార్టిసిపేట్ చేస్తూ, మీ స్నేహితులకు కూడా ఈ చాలెంజ్ విసరండి’ అని మంజు తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.

మంజు చేసిన డ్యాన్స్ భలే ఫన్నీగా ఉండటంతో పాటు ఎంతో రిథమిక్‌గా, గ్రేస్‌ఫుల్‌గా ఉండటంతో ఆమె చేసిన పోస్ట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కూల్ డ్యాన్స్ మూవ్స్, ఫన్ లిరిక్స్ ఉన్న ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుండటంతో చిన్నారులు, యువకులు, సెలెబ్రిటీలు ఎంతోమంది డ్యాన్స్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. మంజు ఎక్స్‌పెక్టేషన్ మించి ఈ చాలెంజ్ వైరల్ కావడంతో దీనిపై స్పందించింది మంజు. ‘నేను తొలిసారి ఓ చాలెంజ్‌ను మొదలుపెట్టాను. ఇది నేను ఊహించిన దానికంటే పది రెట్లు సక్సెస్ సాధించింది. అందరికీ నా ధన్యవాదాలు’ అని తెలిపింది.

Next Story

Most Viewed