నీతి ఆయోగ్ సూచీలో కేరళ మళ్లీ టాప్.. తెలంగాణ ప్లేస్.?

by  |
నీతి ఆయోగ్ సూచీలో కేరళ మళ్లీ టాప్.. తెలంగాణ ప్లేస్.?
X

న్యూఢిల్లీ: అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నట్టు కేరళ రాష్ట్రానికి నీతి ఆయోగ్ మరోసారి కితాబునిచ్చింది. తాజాగా, విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్(ఎస్‌డీజీ) ఇండెక్స్‌లో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 75 మార్కులతో టాప్ ప్లేస్‌లో ఉంది. కేరళతోపాటు హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కింలూ మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 72 మార్కులతో నాలుగో స్థానంలో, తెలంగాణ 69 మార్కులతో 11వ స్థానంలో ఉన్నది.

ఈ జాబితాలో 52 మార్కులతో బిహార్ అట్టడుగున ఉంది. బిహార్ తర్వాత జార్ఖండ్, అసోంలూ వరస్ట్ కేటగిరీలో ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఎస్‌డీజీ సూచీని నీతి ఆయోగ్ రూపొందిస్తున్నది. తాజాగా, ఎస్‌డీజీ 2020-21 ఇండెక్స్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం విడుదల చేశారు. గతేడాది విడుదల చేసిన సూచీలోనూ కేరళనే టాప్ ప్లేస్ దక్కించుకోవడం గమనార్హం.

Next Story

Most Viewed