కరోనా కారణంగా కేరళ రాజ్యసభ ఉపఎన్నిక వాయిదా

by  |
కరోనా కారణంగా కేరళ రాజ్యసభ ఉపఎన్నిక వాయిదా
X

తిరువనంతపురం: కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా కేరళలోని రాజ్యసభ స్థానానికి ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. కేరళ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్(ఎం) నేత జోస్ కే మణి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం జూలై 2024 వరకు ఉండగా, ఈ ఏడాది జనవరి 11నే రిజైన్ చేశారు. ఈ స్థానానికి ఉపఎన్నిక కోసం నిర్వహించిన సమీక్షలో సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ఎన్నిక తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని వివరించింది.

Next Story

Most Viewed