తల్లిదండ్రులు ముస్లిం… కూతురికి హిందూ పెళ్లి

by  |
తల్లిదండ్రులు ముస్లిం… కూతురికి హిందూ పెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్ :
భిన్నత్వంలో ఏకత్వం అనే వాక్యాన్ని కేరళలోని కాసరగోడ్‌కి చెందిన అబ్దుల్లా, ఖతీజా ముస్లిం దంపతులు నిరూపించారు. వారి దత్తపుత్రిక రాజేశ్వరికి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసి అందరి మన్ననలు అందుకున్నారు. మాన్యోట్ దేవాలయంలో విష్ణుప్రసాద్‌తో రాజేశ్వరికి జరిగిన పెళ్లిలో బుర్ఖా ధరించి మరీ ఖతీజా నూతన వధూవరులను ఆశీర్వదించింది.

రాజేశ్వరికి ఏడేళ్లు ఉన్నపుడు తల్లిదండ్రులు చనిపోయారు. ఆమె తల్లిదండ్రులు అబ్దుల్లా వాళ్ల పొలంలో పనిచేసేవారు. అప్పటికే అబ్దుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ రాజేశ్వరిని దత్తత తీసుకుని సొంత బిడ్డలా 22 ఏళ్లు పెంచి పెద్ద చేశారు. విష్ణు ప్రసాద్‌తో సంబంధం కుదిరాక హిందూ సంప్రదాయంలోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ముస్లింలను లోపలికి రానిచ్చే హిందూ దేవాలయాల కోసం కేరళ మొత్తం వెతికారు. చివరికి మాన్యోట్ గుడి దొరికింది. గర్భగుడి ముందు రాజేశ్వరి, విష్ణుప్రసాద్‌ల పెళ్లి జరుగుతుండగా అబ్దుల్లా తరఫు వారందరూ కొద్దిగా దూరం నిలబడి పెళ్లి చూశారు. తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త జంటను అబ్దుల్లా దంపతులు ఆశీర్వదించారు.

Read also..

రాజ్యసభకు బూర?

Next Story

Most Viewed