కేరళలో 25శాతం బస్సు చార్జీల పెరుగుదల

by  |
కేరళలో 25శాతం బస్సు చార్జీల పెరుగుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్సుపోర్టు చార్జీలను 25శాతం పెంచేందుకు నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో వచ్చిన ఆర్థిక కష్టాల నుంచి కేరళ ప్రజా రవాణా వ్యవస్థను గట్టేక్కించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బస్సు ప్రయాణా చార్జీలు 25శాతం మేర పెరుగనున్నాయి.అయితే, గతంలో లానే టిక్కెట్టు కనీస ధర రూ. 8గానే ఉంటుందని కేరళ రవాణా శాఖ మంత్రి ఏకే శ్రీథరన్ తెలిపారు. గతంలో ఈ ధరకు కనీస దూరం 5 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం దాన్ని 2.5 కిలోమీట్లరకే పరిమితం చేశారు. రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల నియమించిన జుడీషియల్ కమిటీ చేసిన సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఇచ్చే రాయతీలను పరిశీలించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అయితే దానికి ఆమోదం లభించలేదు. ప్రస్తుతం విద్యాసంస్థలు మూసి ఉన్నందున విద్యార్థులకు ఇచ్చే ప్రత్యేక రాయితీలు లేకుండా చార్జీలు కొనసాగించాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.



Next Story

Most Viewed