టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ‘మహానటి’ కీర్తి పెళ్లి?

by  |
టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ‘మహానటి’ కీర్తి పెళ్లి?
X

దిశ, సినిమా: నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేశ్ పెళ్లి వార్తలు చాలా సార్లు తెరమీదకి వచ్చాయి. బీజేపీ లీడర్ కొడుకుతో పెళ్లి అని..ఇందుకు అమ్మానాన్న ఒత్తిడి చేస్తున్నారని రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అయింది. కానీ, అవేవీ నిజం కాలేదు. ఇప్పుడు కొత్తగా కీర్తి మ్యారేజ్ గురించి కోలీవుడ్‌లో మరో రకమైన గాసిప్ ట్రెండ్ అవుతోంది. తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో కీర్తి ప్రేమలో పడిందని..పెద్దలు అంగీకరించారని టాక్ నడుస్తోంది.

త్వరలో కీర్తి, అనిరుధ్‌ పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, ఈ వార్త విని అటు కీర్తి..ఇటు అనిరుధ్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసే పనిలో బిజీగా ఉన్నారు. కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ ‘రంగ్ దే’ ‘గుడ్ లక్ సఖి’ సినిమా పనుల్లో బిజీగా ఉంది.



Next Story