నోరూరించే మటన్ కీమా మెంతికూర..!

by  |
నోరూరించే మటన్ కీమా మెంతికూర..!
X

మీ భర్త, పిల్లల కోసం ఏదైనా రుచికరమైన వంట చేయాలనుకుంటున్నారా.. నాన్‎వెజ్ ప్రియులైనా ఒకే రకంగా మటన్ కీమా తినడానికి ఇష్టపడడం లేదా.. అయితే నోరూరించే కీమా మెంతికూర రెసిపీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

మటన్ కీమా -పావు కేజీ
మెంతీకూర -2 కప్పులు
పచ్చిమిర్చి -3
ఉల్లిపాయలు -2
టమాటాలు -2
వాటర్ -ఒక గ్లాసు
నూనె -3 టేబుల్ స్పూన్స్
పసుపు -1/2 టీస్పూన్
కారం -2 టీస్పూన్స్
అల్లంవెల్లుల్లి పేస్ట్ -2 టీస్పూన్స్
జీలకర్ర -1/2 టీస్పూన్
ధనియాల పొడి -1 టీస్పూన్
గరం మసాలా -1/2 టీస్పూన్
ఉప్పు -తగినంత
కొత్తిమీర -ఒక కప్పు.

తయారు చేయు విధానం:

శుభ్రంగా కడిగిన పావు కేజీ మటన్ కీమాలో ఒక 1/4 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ అల్లం వెల్లులి పేస్ట్, 1 టీస్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా ఉడనివ్వాలి లేదా కుక్కర్‎లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరో పక్క స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో 2 కప్పుల మెంతికూరను వేగించుకుని దాని పక్కన పెట్టుకోవాలి.

అదే ఆయిల్‎లో 1/2 టీస్పూన్ జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని వేగించుకోవాలి. దానిలో 1 టీస్పూన్ అల్లం వేసుకుని రెండు తరిగిన టమాటా ముక్కలు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. వాటిలో 1/4 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకుని మొదటగా ఉడకబెట్టిన కీమాను వాటర్‎తో సహా వేసుకోవాలి. అనంతరం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో 1/2 టీస్పూన్ గరం మాసాలా వేసుకుని ప్యాన్‎పై మూత పెట్టి తక్కువ మంటపై వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్‎లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే వేడి వేడి కీమా మెంతికూర రెడీ..


Next Story

Most Viewed