కేసీఆర్ నీకు దమ్ముంటే నాపై రాజద్రోహం కేసు పెట్టు: బండి సంజయ్

by  |

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం జరపమంటే రాజద్రోహం కేసు పెడుతున్నారని, కేసీఆర్ నీకు దమ్ముంటే నాపై రాజద్రోహం కేసు పెట్టు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ నుంచి సోమవారం పాదయాత్ర జరిగింది. 24వ రోజు పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలపై రాజద్రోహం కేసు ఎందుకు పెడుతున్నావో చెప్పు కేసీఆర్ అని ప్రశ్నించారు. కేసీఆర్ పైననే దేశ ద్రోహం కేసు పెట్టాలి అని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంకు పట్టిన శని అన్నారు. అక్టోబర్ 2 ప్రజా సంగ్రామ పాదయాత్ర తరువాత నీవు ఎక్కడికి రమ్మన్నా వస్తా అని బండి సంజయ్ అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఛాలెంజ్‌ల పేరుతో నాటకాలు ఆడుతున్నాయి అన్నారు. అక్టోబర్ 2 లోపు పోడు భూముల సమస్యలను పరిష్కరించకపోతే సీఎం ఫామ్ హౌస్ ను ముట్టడిస్తాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు బోనాలు ఎత్తుతే, వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ లాభపడింది ఆరోపించారు. రాష్ర్టంలో మజ్లీస్ పార్టీని బట్టలు విప్పి పరుగెత్తిస్తా అని హెచ్చారించారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయని సీఎం ఎందుకు అని అన్నారు. మక్కలు కొనకపోతే కేసీఆర్ మెడలు వంచి కొనిపిస్తా అని, ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. కొవిడ్ ను అరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదని దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed