పరువు తీయొద్దు.. కత్రినాను వేడుకున్న స్టార్ హీరో..

by  |
పరువు తీయొద్దు.. కత్రినాను వేడుకున్న స్టార్ హీరో..
X

దిశ,సినిమా: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్‌ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘సూర్యవంశీ’. నవంబర్ 5న రిలీజ్‌ కానుండగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా హీరోయిన్ కత్రినా.. తాజాగా అక్షయ్ కుమార్‌ ఫన్నీ వీడియోను ప్రేక్షకులతో పంచుకుంది. ప్రమోషన్స్ కోసం ఉదయాన్నే వచ్చిన అక్షయ్.. దర్శకుడు రోహిత్‌ ఒళ్లో నిద్రపోతున్న వీడియోను ‘మా మొదటి రోజు ప్రమోషన్స్ కోసం అబ్బాయిల ఉత్సాహాన్ని చూడండి’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘ఒక మూలన రోహిత్ శెట్టి ఒడిలో తలపెట్టి పడుకున్న అక్షయ్, ఉదయపు సూర్యుడిని ఆస్వాదిస్తున్నాడు’ అంటూ కత్రినా వాళ్లిద్దరి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లింది. ఆమె తమ వీడియో తీయడాన్ని గమనించిన అక్షయ్.. మాకు సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వీడియోతీసి మా పరువు తీయొద్దంటూ అక్కడి నుంచి పారిపోతూ కిందపడిపోయాడు. ఈ క్రమంలోనే ‘మమ్మల్ని కాసేపు ప్రశాంతంగా కూర్చోనివ్వవా? నీ లాంటి వ్యక్తుల చిలిపి చేష్టల వల్ల మాకు రెస్ట్ లేకుండా పోతుంది’ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. కాగా ఈ ఫన్ మూమెంట్ నెటిజన్లను ఆకట్టుకుంది.

Next Story

Most Viewed