కత్రిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ జర్నీ

by  |
కత్రిన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ జర్నీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆడపిల్లకు చదువు ముఖ్యం… ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని చెప్తుంటారు. కానీ, ఇప్పటికీ భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో ఆడబిడ్డకు చదువు ఎందుకు? పెండ్లి చేస్తే మరో ఇంటికి పోయి వంట వండి పెడుతిందిలే.. తనకు చదువు చెప్పించడం వల్ల డబ్బు దండగ..టైమ్ వేస్ట్.. చదివితే మాత్రం ఏం చేస్తుంది? అనే భావన ఇంకా కొందరు తల్లిదండ్రుల్లో ఉంది. వారు బయటకి వచ్చి ప్రపంచాన్ని చూస్తేనే ఆ భావన వారి మనసులో నుంచి పోగొట్టుకోగలరు. అమ్మాయిలకు, అబ్బాయిలకు తేడా లేదు అన్న నిజాన్ని తెలుసుకోగలరు. ఇదే అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జీవో సంస్థ వాలంటీర్‌గా పని చేస్తుంది బాలీవుడ్ దివా కత్రినా కైఫ్.

https://www.instagram.com/p/CGHbv5VhK1b/?utm_source=ig_web_copy_link

లాక్‌డౌన్ ముందు నుంచి ఈ సంస్థతో కలిసి ఆడపిల్లలను బడికి పంపేందుకు, లింగ వివక్ష‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న కత్రిన..ఈ కార్యక్రమంలో భాగంగా తను ముందు కలిసిన అమ్మాయి, తన ఫ్రెండ్ ఆయుషిని పరిచయం చేస్తూ పోస్ట్ పెట్టింది. ఇది నిజానికి చాలా ప్రౌడ్ మూమెంట్ అని తెలిపింది. పల్లెల్లో ఉన్న ఆడపిల్లలను బడికి చేర్చాలనే సంకల్పంతో పని చేస్తున్న ఎన్జీవో వాలంటీర్‌గా పనిచేయడం సంతృప్తిని ఇచ్చిందని చెప్పింది క్యాట్. భారతదేశంలోని రూరల్, రిమోట్ ఏరియాల్లో పని చేస్తున్న ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జీవో ఇప్పటి వరకు 7,50,000 మంది ఆడపిల్లలను బడి బాట పట్టేలా చేసిందని.. 1.3 మిలియన్ పిల్లల అభ్యాస ఫలితాలను మెరుగుపరచిందని తెలిపింది.

Next Story