రేవంత్ నాయకత్వాన్ని ప్రశంసించిన కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య

by  |
Former Karnataka CM Siddaramaiah
X

దిశ, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని, పార్టీ బలోపేతానికి నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి పూర్వ వైభవం తేవాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళవారం జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనంపల్లి అనిరుద్ రెడ్డి నివాసంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మధుయాష్కీ గౌడ్, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ అల్పాహారం స్వీకరించారు.

Madhuyashki-Goud

అనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి నియోజకవర్గ ముఖ్య నాయకులతో చర్చించారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీకి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. అందరూ సమిష్టిగా పని చేస్తే ఇటు రాష్ట్రంలో అటు నియోజకవర్గంలో అధికారంలోకి వస్తోందని అన్నారు. ఈ సందర్భంగా నాయకులను జానంపల్లి అనిరుద్ రెడ్డి పూల బొకేలు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, మధుసూదన్ రెడ్డి, కాటం ప్రదీప్ గౌడ్, జడ్చర్ల నియోజకవర్గ అన్ని మండలాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు.



Next Story

Most Viewed