టీఎన్జీఓ అధ్యక్షుడిగా కారం రవీందర్ రెడ్డి ఏకగ్రీవం

by  |
టీఎన్జీఓ అధ్యక్షుడిగా కారం రవీందర్ రెడ్డి ఏకగ్రీవం
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ నాన్ గిజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) అధ్యక్షుడిగా కారం రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం గమనార్హం. అదేవిధంగా కేంద్ర సంఘం ప్రధానకార్యదర్శిగా మామిళ్ల రాజేందర్ మూడోసారి ఏకగ్రీవమయ్యారు. టీఎన్జీవో కేంద్ర సంఘం ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఈ నెల 6న రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆమోదం మేరకు ఎన్నికల అధికారిని నియమించి నోటిఫికేషన్ జారీ చేసినారు. కేంద్రం సంఘానికి ఒకే సెట్ నామినేషన్‌లు దాఖలు చేసినారు. దీంతో కేంద్రం సంఘం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్‌లు మాట్లాడుతూ.. తమ నాయకత్వంపై నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీఎన్జీవో సంఘం అనేక సమస్యలను పరిష్కరించిన చరిత్ర ఉందని, ఉద్యోగులకు రావలసిన వేతన సవరణ, కరువు భత్యం మంజూరు , పదవీ విరమణ వయస్సు పెంపు, ఆంధ్రాలో పనిచేస్తున్న ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం వంటి సమస్యల పరిష్కారం కొరకు త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు వేతన సవరణను 2018 జూలై నుంచి మంజూరు చేయించుకోవడం, ప్రభుత్వం హామీ అయిన పదవీ విరమణ వయస్సు పెంచడం, ప్రభుత్వ ఖాళీలను భర్తీచేయడం, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాల చెల్లింపు మరియు ఇతర రాయితీల గురించి ఆదేశాలు జారీ అయ్యేటట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు.

Next Story

Most Viewed