టవర్ ఎక్కి దూకుతానంటున్న భర్త.. ఆందోళనలో భార్య

154
cell-towers1

దిశ, కామారెడ్డి: భూమిలో తండ్రి తనకు వాటా ఇవ్వడం లేదని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. అతని భార్య తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన మంత్రి సంతోష్ కామారెడ్డి పట్టణంలోని ఓ అపార్టుమెంటులో వాచ్ మెన్ గా పనిచేస్తూ భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే గ్రామంలో ఉన్న ఎకరం భూమిని సంతోష్ తండ్రి రాములు విక్రయించి, అందులో సంతోష్ కు వాటా ఇవ్వనన్నాడని గౌతమి తెలిపింది. గతంలో రెండెకరాల భూమి ఉంటే అందులో ఎకరం అమ్మి అప్పులు కట్టారని, అందులో తనకు డబ్బులు ఇవ్వలేదని తెలిపింది.

tower-1

అయితే, ప్రస్తుతం అమ్మే భూమిలో కూడా తనకు వాటా ఇవ్వననడంతో భూమి విషయంపై మాట్లాడుకోవడానికి గురువారం నందివాడ గ్రామానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. నందివాడకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వెళ్లే దారిలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. టవర్ ఎక్కేముందు 100 కు డయల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటాన్నానని పోలీసులకు చెప్పాడు. మధ్యాహ్నం 1:30 కు భార్య గౌతమికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పడంతో పిల్లలను తీసుకుని భార్య టవర్ వద్దకు చేరుకుంది. సుమారు మూడు గంటల నుంచి పోలీసులు సంతోష్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వినిపించుకోవడం లేదు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..