కు.ని. సర్క్యూలర్‌పై మధ్యప్రదేశ్ సర్కారు యూటర్న్

by  |
కు.ని. సర్క్యూలర్‌పై మధ్యప్రదేశ్ సర్కారు యూటర్న్
X

దిశ, వెబ్‌డెస్క్ : కుటుంబ నియంత్రణ కోసం ఒక్క పురుషుడినీ తీసుకురాని మేల్ హెల్త్ స్టాఫ్‌.. ఉద్యోగం వదిలిపెట్టాలని జారీ చేసిన సర్క్యూలర్‌పై విమర్శలు చెలరేగడంతో మధ్యప్రదేశ్ సర్కారు యూటర్న్ తీసుకుంది. ఈ సర్క్యూలర్‌పై సైన్ చేసిన అధికారినీ బదిలీ చేసినట్టు తెలిసింది. స్టెరిలైజేషన్‌కు సంబంధించిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి పిసి శర్మ వెల్లడించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొగ్రామ్‌లో పురుషులు పెద్దమొత్తంలో పాల్గొనాలని, అలాగే, 2019-20 టార్గెట్‌ను ఛేదించేందుకు రాష్ట్ర ఎన్‌హెచ్ఎం(నేషనల్ హెల్త్ మిషన్) ఈ సర్క్యూలర్‌ను జారీ చేసింది. మార్చి వరకు ఒక్క పురుషుడినైనా స్టెరిలైజేషన్ కోసం తీసుకురావాలని, లేదా కచ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాలని ఆదేశించిన ఈ సర్క్యూలర్‌పై దుమారం రేగడంతో సర్కారు.. వెనుకడుగేసింది.

Next Story

Most Viewed