సెంచరీ కొట్టి సత్తా చాటుతాం : కవిత

by Sridhar Babu |
సెంచరీ కొట్టి సత్తా చాటుతాం : కవిత
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర అభివృద్దిని ప్రశ్నించడం మాని కేంద్రం నుంచి రావల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు పలికారు. బుధవారం కరీంనగర్‌లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం టీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించడం హస్యాస్పదంగా ఉందన్నారు. గ్రేటర్‌లో సెంచరీ కొట్టి టీఆర్ఎస్ సత్తా చాటుందని, కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి హామీని నెరవేరుస్తామన్నారు. కరీంనగర్ పాత బజార్ శివాలయంలో పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని కవిత అన్నారు.Next Story

Most Viewed