రంగురంగుల ముగ్గులతో అలరించిన ఎమ్మెల్సీ కవిత..

348
kavitha

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సంక్రాంతి పండుగను సాంప్రదాయం బద్దంగా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత తమ ఇంటి వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులు వేశారు. ఆమె స్వయంగా ముగ్గులు వేసి, సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.