ఈ ఏడాది ప్రారంభించనున్న కాళేశ్వరం టూరిజం సర్క్యూట్

by  |
ఈ ఏడాది ప్రారంభించనున్న కాళేశ్వరం టూరిజం సర్క్యూట్
X

దిశ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రా ప్రభుత్వం తరపున బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ పండుగులను నిర్వహిస్తున్నామని తెలపారు. దీనితో పాటు రాష్ట్రాంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది కరోనా కారణంగా బడ్జెట్ లో ప్రతిపాదించిన కొన్ని పనులను పూర్తిచేయలేకపోయాం, ఈ ఆర్థిక సంవత్సరం కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు ప్రారంభిస్తామన్నారు. 2021-22 బడ్జెట్ లో సాంస్కృతిక, పర్యాటక శాఖలకు రూ.726 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.385.62 కోట్లను కేటాయించారు.

Next Story

Most Viewed