జూడాల చర్చలు విఫలం.. విధుల్లో చేరతారా.. సమ్మె కొనసాగిస్తారా..?

by  |
జూడాల చర్చలు విఫలం.. విధుల్లో చేరతారా.. సమ్మె కొనసాగిస్తారా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే రేపటి నుంచి అత్యవసర సేవలను నిలిపివేస్తామని జూడాలు హెచ్చరించిన నేపథ్యంలోనే డీఎంఈ రమేష్ రెడ్డి కొద్దిసేపటి కిందట జూడాల అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే, డీఎంఈతో జరిపిన చర్చలు ఫలించ లేదని తెలుస్తోంది.

10 శాతం కొవిడ్ ఇన్సెంటివ్‌తో పాటు ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో కరోనాతో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించేందుకు డీఎంఈ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందున విధుల్లో చేరాలా వద్దా అనే విషయంపై చర్చిస్తున్నట్లు జూడాలు తెలిపారు. అంతేకాకుండా తమకు రాతపూర్వక హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని ప్రభుత్వానికి జూడాలు స్పష్టంచేసినట్లు తెలిసింది.



Next Story

Most Viewed