'టీమ్ ఇండియాతో ఆడితేనే ఒత్తిడి ఎలా జయించాలో తెలుస్తుంది'

by  |
Junaid
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాతో ఆడితేనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండే ఒత్తిడి ఏంటో తెలుస్తుందని.. కానీ తనకు ప్రస్తుతం ఆ అదృష్టం లేదని పాకిస్తాన్ పేసర్ జునైద్ ఖాన్ అన్నాడు. ‘భారత్-పాకిస్తాన్ జట్లు ఆడుతుంటే ఇరు దేశాల ఫ్యాన్స్ ఎంతో ఉద్వేగంతో ఉంటారు. అదే సమయంలో క్రికెటర్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని జయించడం అంత సులభం కాదు. అలాంటి మ్యాచ్‌లు ఆడటం వల్ల ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకోవచ్చు’ అని జునైత్ అన్నాడు.

కాగా, ఇరు దేశాల మధ్య కేవలం ఐసీసీ ఈవెంట్ల మ్యాచ్‌లు తప్ప ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడం లేదు. త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఇరు దేశాల మధ్య మ్యాచ్ చూసే అవకాశం కలుగవచ్చు. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని పాకిస్తాన్ ప్లేయర్లు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇండియాతో ఆడటం వల్ల ఎన్నో విధాలుగా లాభం ఉంటుందని అక్కడి క్రికెటర్లు నమ్ముతున్నారు. కానీ సమీప భవిష్యత్‌లో వారి కోరిక నెరవేరే అవకాశం లేదు.



Next Story

Most Viewed