డైమండ్ రింగ్ పోగొట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్

by Shyam |   ( Updated:2020-12-14 02:45:28.0  )
డైమండ్ రింగ్ పోగొట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జుహీచావ్లా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన ఇయర్ రింగ్‌ను పోగొట్టుకుంది. కాగా, ఆ ఇయర్ రింగ్ తనకు ఎంతో సెంటిమెంట్ అని, 15 సంవ‌త్సరాలుగా ప్రతి రోజు వాటినే ధరిస్తున్నానని తెలిపిన ఈ సీనియర్ హీరోయిన్.. త‌ను పోగొట్టుకున్న ఇయ‌ర్ రింగ్‌ను తెచ్చి ఇవ్వండ‌ని నెటిజ‌న్స్‌ను కోరింది.

‘ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టీ2 నుంచి గేట్ 8 వైపు నడుస్తుండగా నా డైమండ్ ఇయర్ రింగ్ జారి పడిపోయింది. ఎమిరేట్స్ కౌంటర్, సెక్యూరిటీ చెక్ ఇమ్మిగ్రేషన్స్ వద్ద చాలాసేపు వెతికినా కూడా క‌నిపించ‌లేదు. ఎవ‌రికైనా దొరికితే పోలీసుల‌కు స‌మాచారం అందించండి. రింగ్ ఇచ్చిన వారికి విలువైన బ‌హుమ‌తి ఇస్తాను. ప్లీజ్ ఆ రింగ్ విషయంలో నాకు హెల్ప్ చేయండి’ అని నటి, నిర్మాత, మోడల్ అయిన జుహీచావ్లా తన ట్విట్టర్‌లో పేర్కొంది.

Advertisement

Next Story