మరో స్వాతంత్య్ర పోరాటం చేద్దాం.. కదలిరండి: నానా పటోలే

by  |
మరో స్వాతంత్య్ర పోరాటం చేద్దాం.. కదలిరండి: నానా పటోలే
X

ముంబై: కేంద్రం తప్పుడు విధానాలపై పోరాడేందుకు యువత ముందుకు రావాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే పిలుపునిచ్చారు. దీనిని ‘స్వేచ్ఛ కోసం పోరాటం’గా అభివర్ణించారు. స్వాతంత్య్ర యోధుడు బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో నానా పటోలే పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి స్వేచ్ఛను లాగేసుకుంటున్నదని ఆరోపించారు. దేశ స్వాతంత్రం కోసం ఏమాత్రం పోరాడని వ్యవస్థలో బీజేపీ ఓ భాగమని వ్యాఖ్యానించారు.

“స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా రాశారని లోక్‌మాన్య తిలక్‌పై కేసులు పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితీ అలాగే ఉంది. మోడీ ప్రభుత్వం మీడియాను లక్ష్యంగా చేసుకుంది. మనం మరోసారి స్వాతంత్య్రం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవల ఓ కశ్మీర్ యువకుడిని కలిశాను. యూపీఎస్సీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు చెప్పాడు. ముస్లిం అయినందునే రాజీనామా చేయాల్సి వచ్చిదంటూ కేంద్రాన్ని నిందించాడు” అంటూ నానా పటోలే చెప్పుకొచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర పోరాటం చేయడానికి దేశ యువత కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed