నిరుద్యోగులకు శుభవార్త: ఉచిత ఉపాధి శిక్షణ.. హాస్టల్, భోజన వనతితో పాటు ఉద్యోగం

by Disha Web |
నిరుద్యోగులకు శుభవార్త: ఉచిత ఉపాధి శిక్షణ.. హాస్టల్, భోజన వనతితో పాటు ఉద్యోగం
X

దిశ,కెరీర్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత ఉపాధి శిక్షణతో పాటు ఉద్యోగ కల్పన కార్యక్రమం నిర్వహిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్..భోజన వసతితోపాటు ఉద్యోగం కల్పిస్తారు.

శిక్షణ కార్యక్రమాలు:

1. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్) సోలార్ సిస్టమ్ ఇన్ స్టాలేషన్, సర్వీస్

అర్హత: ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత

2. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజీ, క్విల్డ్ బ్యాక్స్ మేకింగ్

అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 6 నెలలు

ఇతర అర్హతలు: వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

చదువు మధ్యలో ఉన్న వారు అనర్హులు.

కావలసిన పత్రాలు:

అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్

పాస్ పోర్ట్ ఫొటోలు

ఆధార్ కార్డు

ఇన్‌కమ్ సర్టిఫికెట్

చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ - 508284.

ఎంపిక తేదీ: డిసెంబర్ 5, 2022 ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాలి.

వివరాలకు ఫోన్ : 9133908000, 9133908111, 9133908222.




Next Story

Most Viewed