లక్ష రూపాయల జీతంతో నైవలీ లిగ్నైట్‌లో ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!

by Disha Web Desk 17 |
లక్ష రూపాయల జీతంతో నైవలీ లిగ్నైట్‌లో ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!
X

దిశ, కెరీర్: నైవేలీ లోని ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) జూనియర్ ఓవర్‌మ్యాన్, సర్వేయర్, సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 213

పోస్టుల వివరాలు:

జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రైనీ) - 51

జూనియర్ సర్వేయర్ (ట్రైనీ) - 15

సిర్దార్ (సెలక్షన్ గ్రేడ్ - 1): 147

అర్హత: పోస్టులను అనుసరించి డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజనీరింగ్/మైన్ సర్వేయింగ్)/డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఓవర్ మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: నవంబర్ 1, 2022 నాటికి 30 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు జేవో, జేఎన్ పోస్టులకు రూ. 31,000 నుంచి రూ. 1,00,000, సిర్దార్ లకు రూ. 26,000 నుంచి రూ. 1,10,000 ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా..

చివరి తేదీ: డిసెంబర్ 30, 2022.

వెబ్‌సైట్: https://www.nlcindia.in


Next Story

Most Viewed