పోస్టాఫీసుల్లో భారీగా జాబ్స్.. పరీక్ష లేకుండానే ఉద్యోగం

by Disha Web Desk 4 |
పోస్టాఫీసుల్లో భారీగా జాబ్స్..  పరీక్ష లేకుండానే ఉద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 38,926 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో 1716, తెలంగాణలో 1226 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. జూన్ 5 చివరితేదీ. ఈ పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. పదో తరగతిలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుని మెరిట్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి

జీతం: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు రూ.12 వేలు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10 వేలు

https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.



Next Story