BECIL నుంచి రూ. 56 వేలకు పైగా జీతంతో ఉద్యోగాలు

by Harish |
BECIL నుంచి రూ. 56 వేలకు పైగా జీతంతో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో పని చేయుటకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 73

పోస్టుల వివరాలు:

జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్/స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, ఓపీడీ అటెండెంట్, టెక్నికల్ ఆఫీసర్, అనస్థీషియా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఆర్థోపెడిక్/ప్లాస్టర్ టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్.

అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి/10+2/ఇంటర్మీడియట్/బీఈ/బీటెక్/బీఎస్సీ/గ్రాడ్యుయేషన్/డిప్లొమా/డీఎంఎల్ టీ/ఎంసీఏ/ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు రూ. 22,000 నుంచి రూ. 56,100 ఉంటుంది.

ఎంపిక: స్కిల్ టెస్ట్ /ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 21, 2023.

వెబ్‌సైట్: https://www.becil.com

Next Story